Telangana Temple | తొలగనున్నరాజన్న భక్తుల ఇక్కట్లు
Telangana Temple | తొలగనున్నరాజన్న భక్తుల ఇక్కట్లు
వేములవాడ గుడి అభివ్రద్ది కోసం రూ.50 కోట్లు విడుదల
ఈ నెల 20 అభివ్రుద్ధి పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్
Hyderabad : తెలంగాణలో అతిపెద్ద శైవక్షేతం వేములవాడ దేవాలయం రూపరేఖలు పూర్తగా మారబోతున్నాయి. వేములవాడలోని రాజన్న దేవాలయానికి మహర్దశ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన అభివ్రుద్ధి పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ప్రజల సంక్షేమంతో పాటుగా.. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. కొనసాగింపుగా ఈ మధ్య కాలంలో యాదగిరిగుట్టలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరుమలలో Tirumal Tirupati Devastanam (TTD) తరహాలో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు పడినట్లే. దేవాలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసరమైన ప్రణాళికలకు రూపొందించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నూతనంగా రెండో ధర్మగుండం నిర్మాణం, క్యూలైన్ల విస్తరణ, వసతి గదులు, కల్యాణ మండప నిర్మాణం, కోడెలకు ఆధునిక వసతులతో గోశాల నిర్మాణం, యాగశాల, అన్నదాన సత్రం వంటి అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించనున్నారు.
* * *
Leave A Comment